దర్బార్: అందరి దృష్టి ఫస్ట్ డే కలెక్షన్ల మీదనే... 

దర్బార్: అందరి దృష్టి ఫస్ట్ డే కలెక్షన్ల మీదనే... 

దర్బార్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.  దీంతో థియేటర్ల వద్ద సందడి నెలకొన్నది.  తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో టికెట్స్ దొరకడం మహా కష్టంగా మారింది. ప్రీమియర్ షోలు ఇప్పటికే ముగియడంతో అందరి దృష్టి ఫస్ట్ డే కల్లెక్షన్లపై పడింది.  ఫస్ట్ డే ప్రపంచం మొత్తం మీద కనీసం రూ. 100 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుందని అంటున్నారు.  లాంగ్ రన్ లో ఈ సినిమా ఈజీగా రూ. వెయ్యి కోట్లు వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.  

రజినీకాంత్ తో మంచి స్టోరీతో సినిమా చేస్తే ఆ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి అన్నది ఈ సినిమా మరోసారి నిరూపించింది.  అందుకే రజినీతో సినిమా చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు.  రజిని సినిమా సూపర్ హిట్ కావడంతో..దీని ప్రభావం సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలపై పడే అవకాశం ఉన్నది.