అయోధ్య రామ్ జన్మభూమి ట్రస్ట్ ఖాతా నుంచి డబ్బు మాయం...

అయోధ్య రామ్ జన్మభూమి ట్రస్ట్ ఖాతా నుంచి డబ్బు మాయం...

అయోధ్యలో రామ్ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఆగస్టు 5 వ తేదీన రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ జరిగింది.  భూమి పూజ అనంతరం ఆలయనిర్మాణాన్ని రామ్ జన్మభూమి ట్రస్ట్ ప్రారంభించింది.  ఇదిలా ఉంటె, ఈ రామ్ జన్మభూమి ట్రస్ట్ కు సంబంధించిన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి రెండుసార్లు భారీగా నగదు మాయం అయ్యింది.  సెప్టెంబర్ 1 వ తేదీన లక్నోలోని బ్యాంకు నుంచి రూ.6 లక్షల రూపాయలు, మరో రెండు రోజుల తరువాత మూడున్నర లక్షల రూపాయలను ట్రస్ట్ చెక్ తో విత్ డ్రా చేసుకున్నారు. రెండుసార్లు బ్యాంకు నుంచి డబ్బును విత్ డ్రా చేసిన దుండగులు, మూడోసారి బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి రూ.9.86 లక్షల రూపాయలను విత్ డ్రా చేసేందుకు ప్రయత్నం చేశారు.  అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది క్రాస్ చెక్ చేసుకునేందుకు ట్రస్ట్ కు కల చేసి అడగడంతో, తాము ఎలాంటి చెక్ లు ఇవ్వలేదని చెప్పారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆలయ నిర్మాణం కోసం అనేకమంది దాతలు ముందుకు వచ్చి డబ్బును విరాళంగా ఇస్తున్న సంగతి తెలిసిందే.