సినీ నటుడు శివబాలాజీ ఫిర్యాదు పై స్పందించిన హెచ్‌ఆర్‌సి...

సినీ నటుడు శివబాలాజీ ఫిర్యాదు పై స్పందించిన హెచ్‌ఆర్‌సి...

మణికొండ లోని మౌంట్ లిటరజీ స్కూల్ పై తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సి) ఛైర్మన్ కు సినీ నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కూల్ యాజమాన్యం ఫీజ్ కోసం వేధిస్తుంది అని ఆరోపించారు. ఫీజులు తగ్గించుకోమని అడిగితే తన కుమారుడిని ఆన్లైన్ క్లాసుల నుండి అర్ధాంతరంగా డిస్ కనెక్ట్ చేసారు అని తెలిపాడు. అయితే శివబాలాజీ ఫిర్యాదు పై హెచ్‌ఆర్‌సి స్పందించింది. మౌంట్ లిటేరాజీ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సి ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా DEOకి నోటీసులు పంపింది.  అయితే చాలా మంది తలిదండ్రులను ఇలానే ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిన ఆయన వారంత బయటికి చెప్పడానికి భయపడుతున్నారు అని శివబాలాజీ  అన్నారు. ఇక ఈ స్కూల్ కారణంగా మేము కూడా సమస్యలు ఎదుర్కున్నాము అని కమెడియన్ ఆలీ కూతురు కూడా చెప్పిన విషయం అందరికి తెలిసిందే.