వైరల్: విమానం అంచున కూర్చొని ఫోటోగ్రాఫర్ సాహసం... 

వైరల్: విమానం అంచున కూర్చొని ఫోటోగ్రాఫర్ సాహసం... 

చేసే పనిలో నిబద్దత ఉంటె ఎంత కష్టమైన పనినైనా సరే అవలీలగా చెయ్యొచ్చు.  అలా చేసిన వ్యక్తులు జీవితంలో తప్పనిసరిగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.  దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.  ఏ రంగమైనా కావొచ్చు నిష్ఠ, నిబద్దతతో పనిచేస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.  దీనిని నిరూపించాడు ఓ ఫోటోగ్రాఫర్.  90వ నేషనల్ డే ఆఫ్ సౌదీ అరేబియా వేడుకలను పురష్కరించుకొని  రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ విమానాలు రిహార్సిల్స్ నిర్వహించాయి.  గాలిలో విన్యాసాలు చేస్తున్న విమానాలను గాలిలో నుంచే ఫోటోలు తీయాలని అనుకున్నాడు ఓ ఫోటో గ్రాఫర్.  సౌదీ ఆర్మీకి చెందిన విమానంలో వెనుక భాగంలో నిలబడి ప్రాణాలకు తెగించి ఎయిర్ ఫోర్స్ కు విమానాల రిహార్సిల్స్ కు సంబంధించిన ఫోటో షూట్ చేశాడు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.