గ్రామీణ విద్యారంగంపై ఆన్‌ లైన్‌ బోధన ప్రభావం

గ్రామీణ విద్యారంగంపై ఆన్‌ లైన్‌ బోధన ప్రభావం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అనేక వర్గాల ప్రజల జీవవ విధానంపై ప్రభావితం చేసింది...ప్రజలు తమ రోజు వారి జీవన శైలిలో పూర్తి మార్పులకు గురిచేసింది..అనేక పాత విధానాలకు స్వాస్తి చేప్పి కొత్త జీవన శైలిని అలవర్చుకోంటున్నారు..ఆహారం,ఆరోగ్యం,విద్యా,ఉద్యోగ రంగంలో ఈ మార్సులు కొట్టోంచినట్లు కన్పిస్తుంది...

కరోనాకు వ్యాక్సిన్‌ ఇప్పట్లోవచ్చే అవకాశాలు లేవని కరోనాతో కలిసి జీవించాలని మన దేశ పాలకులు సహా అంతర్జాతీయ సంస్థలు ప్రటించాయి...ఒక కొత్త రకం జీవితో కలిసి జీవించడం అంత ఈజీ కాదు, ముఖ్యంగా  కరోనా లాంటి మహమ్మారితో కలిసి జీవించటం సులువు కాదు...కాని తప్పదు అంటున్నారు పాలకులు..

కరోనా విజృంభణ మషిని జీవన శైలితో పాటు దేశంలో విద్యాబోధన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది...లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు మూసివేయటంతో ఆన్‌లైన్‌ బోధనవైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు... కేంద్రం కూడా ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా నూతన డిజిటల్‌ విద్యావిధానాన్ని ప్రకటించింది... ఒక్కో తరగతికి ఒక్కో టీవీ చానల్‌ను ప్రారంభించి ఆన్‌లైన్‌ పాఠాలు ప్రసారం చేయనున్నారు... అయితే, ఆన్‌లైన్‌ బోధన ఎప్పటికీ తరగతి బోధనను భర్తీచేయలేదని విద్యావేత్తలు అంటున్నారు... ముఖ్యంగా ప్రాథమిక తరగతి స్థాయిలో బోధన చైల్డ్‌ సైకాలజీ ఆధారంగా జరుగాలని, కానీ టీవీల్లో వచ్చే పాఠాలతో అది సాధ్యంకాదని స్పష్టంచేస్తున్నారు. అందునా కేంద్రప్రభుత్వం ప్రారంభించే టీవీ చానళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా బోధన ఉంటుందని, దానివల్ల రాష్ర్టాల సిలబస్‌ చదివే విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు...

గ్రామీణ భారతంలో ఆన్‌లైన్‌ విద్యా బోధన సాధ్యం అవుతుందా...ఇప్పటికు ప్రభుత్వ పాఠశాలు అరకోర నిధులతో నడుస్తున్నాయి..విద్యార్థులకు,ఉపాధ్యాయులకు శాతం చాలా తక్కువగా ఉంది...80 శాతం అక్షరాస్యత ఉన్న భారత్‌ లాంటి దేశంలో ఆన్‌లైన్‌ విద్యా ఎంత మందికి అందుబాటులోకి వస్తుందంటున్నారు వేధావులు...గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత మరి తక్కువగా ఉంది, వారికి టెక్నాలిజిని ఎలా వాడాలో కూడా తెలువదు...ఇక ఏజీన్సీలో చెప్పనవసరమే లేదు...

దేశంలో ఆన్‌లైన్ విద్యాను అభ్యసించడానికి గ్రామీన ప్రాంతంలలో ఎటువంటి ముందస్తూ ఏర్పాట్లు చేయకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం అనేక విమర్శలకు దారి తీస్తుంది...ఇది గ్రామీణ  పేద,మధ్యతరగి విద్యార్థులను విద్యాకు దూరం చేయడమే అనుతుందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

కరోనా కారణంగా చితికిపోయిన గ్రామీణ భతుకులకు ఆన్‌ లైన్‌ విద్యా మరింత భారంగా మారనున్నది..తినడానికి తిండి లేకున్న ఆన్ లైన్‌ విద్యా కోసం,తమ పిల్లల భవిష్యత్‌ కోసం తప్పనిసరిగా ఇప్పడు టీవీ లేదా కంప్యూటర్ కొనుకోవాలి...దానికి ఇంటర్‌ నెట్ పెట్టించుకోవాలి...అందు కోసం ఏదో ఒక నెట్ వర్క్‌ను సంప్రదించాలి.. కష్టంగా అన్ని సమకూర్చుకున్న ప్రకృతి ముఖ్యంగా ఈ నెట్ వర్క్‌లు గ్రామీణ  ప్రాంతంలో ఎంత వరకు నెట్‌ వర్క్‌ను అందిస్తాయో కేంద్రం స్పష్టత ఇవ్వలేదని,  దాని వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టమే తప్ప ఉపయోగం లేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు...

ఇక మరోవైపు తరగతి గది విద్యా విద్యార్థి సామార్థ్యాన్ని పెంచుతాయి...కాని ఆన్‌లైన్‌ విద్యా  ద్వారా విద్యార్థి ప్రతిభను అంచన వేయడం కష్టం...ఇది విద్యార్థిలో ఉన్న సృజనాత్మకతను గుర్తించకుండా చేస్తుంది..విద్యార్థి ఒంటరితంగా ఫీలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు..తరగతి గదిలో ఒక్కో విద్యార్థి సామర్థ్యాలు ఏమిటో, బలహీనతలు ఏమిటో తెలుసుకొని ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా బోధన చేస్తారు... ఇలాంటి బోధన ద్వారానే విద్యార్థి సమగ్ర ప్రగతి, మూర్తిమత్వం సాధ్యమవుతుంది... కానీ ఆన్‌లైన్‌ విద్య ద్వారా ఇది సాధ్యంకాదని విద్యాశాఖ సీనియర్‌ అధికారులు,అభిప్రాయపడుతున్నారు. స్వయంప్రభ పేరుతో 1 నుంచి 12వ తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక్కో చానల్‌ చొప్పున 12 చానళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఇందులో ప్రసారం చేసే సిలబస్‌, ఇతర విధానాలపై స్పష్టత ఇవ్వకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని సీనియర్‌ ప్రొఫెసర్లు అంటున్నారు...

ఆన్‌లైన్‌ విద్యా ద్వారా మరో ప్రమాదం కూడా ఉంది...ఆన్‌ లైన్‌ విద్యా విద్యార్థిని ఇక మర వస్తువుగా మార్చుతుంది...మానవ సంబంధాలు, భావోద్వేగాలకు పూర్తిగా దూరం చేస్తుంది..భవిష్యత్‌లో అతడు జీవం ఉన్న మర వస్తువుగా మాత్రమే తయారయ్యే ప్రమాదం లేకపోలేదు...ఇంట్లో తల్లిదండ్రులతో సంచుకోలేని అనేక విషయాలు మిత్రులలో పంచుకోవడానికి తరగతి గది ఒక వేదికగా ఉంటుంది...అన్‌ లైన్ విద్యా ద్వారా అది సాధ్యం కాదు కదా..పిల్లల్లో మానసిక ఓత్తిడి పెరిగి, అనేక సామాజిక రుగ్మతలకు దారి తీస్తాయి..
ప్రపంచంతో పోటీ పడుతున్న పిల్లల తల్లిదండ్రులు వారిలో ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించగలిగే అవకాశంలేదు..ఇతర పిల్లలో కలిసి అభిప్రాయాలు పంచుకునే వెసులుబాటు ఆన్‌లైన్‌ విద్యా కల్పించదు..ఏలాంటి బావోధ్వేగాలు లేకుండా పిల్లలు పెరిగితే భవిష్యత్‌లో వారు రోబోలుగా మారుతారు తప్ప సమాజ అభివృద్దికి దోహదపడే మానసిక స్థితి వారిలో ఉండకపోవచ్చు..

ఆన్‌లైన్‌ విద్యా గ్రామీణ విద్యార్థుల ఆత్మస్థైర్యంపై దెబ్బ తీస్తుంది..వారిలో ఉన్న నైపుణ్యం బయటకు తీయలేదు..గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్థలకాల పరిస్థితుల వల్ల, టెక్నాలజిని అధికంగా వినియోగిస్తున్న పట్టణ ప్రాంతం  విద్యార్థులతో పోటీ పడలేరు..పోటీని తట్టుకోకుండా చదువును మధ్యలోనే వదిలివేసే అవకాశం ఉంది..దాంతో నిరుద్యోగం పెరుగుతుంది..పిల్లలు చదువుపై విరక్తి చెంది డబ్బులు సంపాదించేందుకు తప్పడుదోవ పట్టి సమాజానికి ఇబ్బంది కరంగా మారవచ్చు..దీంతో సమాజంలో క్రైమ్‌ రేటు పెరుగుతుంది...

ఆన్‌లైన్‌ విద్యాతో ఉపాధ్యాయలు తమ కోల్పోవలసి వస్తుంది..ప్రభుత్వం క్రమంగా విద్యారంగం నుంచి తప్పకుంటునే అవకాశం ఉంది...ప్రైవేట్ కార్పోరేట్ విద్యా సంస్థలు విశృంకలంగా ఏర్పాడుతాయి...దీంతో విద్యాహక్కుకు భంగం కలుగుతుంది.. పేదలు,మధ్యతరగతి పిల్లలు విద్యాహక్కును కోల్పోతారు...

తరగతి గది బోధనకు తోడుగా డిజిటల్‌ బోధనలో ఎడ్యుశాట్‌ ప్రాజెక్టును చాలా రాష్ర్టాలకంటే ముందే మన రాష్ట్రంలో టీ-శాట్‌ పేరుతో తరగతి గది బోధనకు తోడుగా 2016లోనే అందుబాటులోకి తెచ్చారు... విద్య, నిపుణ ఛానళ్ల ద్వారా పదోతరగతి వరకు డిజిటల్‌ పాఠాలు ప్రసారం చేస్తున్నారు...ఇది మంచి పరిణామం...కాని విద్యార్థి తనకుతాను నేర్చుకునే మానసిక స్థితిలో ఉన్నప్పడు ఆన్‌లైన్ విధానం ఉపయోగపడుతుంది...అంతేకాని..విద్యార్థి మానసిక పరిపక్వత చెందనప్పుడు అన్ లైన్‌ విద్యా విధానం అనేక చెడు పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది...

ఆన్ లైన్‌ విద్యా విధానం కార్పోరేట్ సంస్థలకు కాసులు కురించేదే తప్ప మేజార్టీ విద్యార్థులకు ఇది యమపాశంగా మారే ప్రమాదం ఉంది...ప్రభుత్వా విద్యా సంస్థల్లో,ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో టెక్నాలజి విద్యాకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించకుండా ఆన్‌లైన్‌ బోధన విఫల ప్రయత్నమే అంటున్నారు మేధావులు..