ఫాన్స్ ని నిరాశపరిచిన హాట్ హీరోయిన్..

ఫాన్స్ ని నిరాశపరిచిన హాట్ హీరోయిన్..

సమీరా రెడ్డి... టాలీవుడ్ లో మెగాస్టార్, ఎన్టీఆర్ తో కలిసి నటించి యూత్ ని బాగా ఆకట్టుకుంది. అప్పట్లో ఈ ముద్దు గుమ్మ హాట్ హాట్ అందాలకి యూత్ ఫిదా అయిపోయారు. తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడ సెటిల్ అయిపోయింది. కోలీవుడ్ హీరోలు విశాల్ - ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తుందని  వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై సమీరా స్పందించింది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాననే వార్తలన్నీ అవాస్తవాలని.. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని సమీరా రెడ్డి చెప్పింది. దీంతో ఆమెను మళ్ళీ తెరపై చూడాలనుకున్న ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. కాగా సమీరా ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను ప్రేమించి వివాహం చేసుకుంది. దాంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సమీరా తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటుంది. గర్భధారణ సమయంలో.. ప్రసవానంతరం ఎదుర్కొన్న శరీరాకృతి సమస్యలు.. మహిళలు స్వతంత్రంగా గౌరవంగా జీవించాలంటూ అనేక అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంది. అలానే తరచూ తన పిల్లలతో భర్తతో కలిసి చేసే సరదా వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటూ ఫాన్స్ ని ఆనందపరుస్తూ ఉంటుంది.