షాకింగ్ న్యూస్: కరోనా సోకే ప్రమాదం వీరికే ఎక్కువ...

షాకింగ్ న్యూస్: కరోనా సోకే ప్రమాదం వీరికే ఎక్కువ...

కరోనా వైరస్ కు తన మన అనే భేదం లేదు.  ఎవరికైనా సోకవచ్చు.  కరోనా వైరస్ మిగతా వారితో పోలిస్తే ఊబకాయం ఉన్న వ్యక్తులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్తున్నారు.  శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్ లెప్టిన్.  లెప్టిన్ హార్మోన్ శరీరంలో ఎక్కువగా ఉన్నది అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.  వీరిలో కొవ్వు కూడా అధికంగా ఉంటుంది.  దీంతో అనేక సమస్యలు వస్తుంటాయి.  ఊపిరితిత్తుల సమస్య కూడా అధికంగా ఉంటుంది.  

లెప్టిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయ్యే వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్తున్నారు.  మాములు వ్యక్తుల కంటే అధిక బరువు ఉండే వ్యక్తులకు కరోనా సోకుతున్నట్టు వారి పరిశోధనలో తేలింది.  కాబట్టి వీలైనంత వరకు బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలని, లేదంటే కరోనా బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు పరిశోధకలు.