ఆ ఇంటి అద్దె నెలకు రూ.1.26 కోట్లు

ఆ ఇంటి అద్దె నెలకు రూ.1.26 కోట్లు

సాధారణంగా ఇంటి అద్దె ఎంత ఉంటుంది అంటే నెలకు 10 నుంచి ఐదు లేదా ఆరు లక్షల వరకు ఉంటుంది అని చెప్తారు.  అంతకంటే ఎక్కువ అద్దె చెల్లించే బదులుగా సొంతంగానే ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు.  కానీ, హాంకాంగ్ లో ఓ వ్యక్తి ఓ ఇంటికి నెలకు అక్షరాలా రూ.1.26 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాడట.  10,804 చదరపు అడుగుల ఇంట్లో ప్రైవేట్ గ్యారేజ్, గార్డెన్, ఎలివేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయట.  విక్టోరియా హార్బర్ కు దగ్గరగా ఉండటంతో ఈ ఇంటి అద్దె భారీగా ఉన్నట్టు చెప్తున్నారు.  హాంకాంగ్ లోని విక్టోరియా హార్బర్ నుంచి ప్రతిరోజూ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది.  నిత్యం వ్యాపారం చేసే వ్యక్తులే ఈ ఇంటిని అద్దెకు తీసుకొని ఉండొచ్చు.  సంవత్సరానికి ఈ ఇంటి కోసం రూ.15 కోట్ల రూపాయల అద్దె చెల్లిస్తున్నారట.  హాంకాంగ్ మొత్తం మీద ఇదే ఖరీదైన అద్దె ఇల్లు అని చెప్తున్నారు.