టెర్రరిస్ట్ లకు కరోనా...పుల్వామా తరహా దాడి ?

టెర్రరిస్ట్ లకు కరోనా...పుల్వామా తరహా దాడి ?


ఒకవైపు కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు సంఘవిద్రోహ కార్యక్రమాలు చేస్తున్నారు.  జమ్మూకాశ్మీర్ లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండు నెలల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో వందమందికి పైగా ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది.  
అయినా జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చి పోతూనే ఉన్నారు. ఈరోజు అచ్చం పుల్వామా తరహాలో దాడికి ప్రయత్నించారు. గంగూ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి దిగారు. కాన్వాయ్ టార్గెట్‌గా ఐఈడీని పేల్చారు. 

ఈ ఘటనలో ఒక జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన జవాన్లు.. ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. ఇక మారో పక్క జ‌మ్మూక‌శ్మీర్‌ కుల్గాం జిల్లాలో శ‌నివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులకు, కొవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. మెడికో-లీగ‌ల్ ప‌రీక్షల్లో భాగంగా ఉగ్రవాదుల మృతదేమాలకు శ్రీన‌గ‌ర్‌లోని సీడీ ఆసుప‌త్రిలో పోస్టుమార్టంతోపాటు డీఎన్ఏ, కొవిడ్ పరీక్షలు చేశారు. దీంట్లో వారిద్దరికీ వైర‌స్ సోకినట్లు తేలిందని పోలీసులు చెప్పారు. కొవిడ్-19 నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వీరికి బారాముల్లాలో అంత్యక్రియలు చేయనున్నట్టు తెలిపారు.