మళ్ళీ నెట్స్ లోకి హిట్ మ్యాన్...

మళ్ళీ నెట్స్ లోకి హిట్ మ్యాన్...

ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్ లు ఆడిన ముంబై 7 విజయాలు సాధించింది. మరొక విజయం సాధిస్తే ముంబై ప్లే ఆఫ్ రేస్ లో బెర్త్ ఖాయం చేసుకుంటుంది. కానీ గత మ్యాచ్ లో 195 పరుగులు చేసిన ముంబై ఓడిపోయింది. అయితే అంతకముందు పంజాబ్ తో ఆడిన మ్యాచ్ లో ముంబై రెండు సూపర్ ఓవర్లు ఆడి ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్ లో ఆ జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ గాయపడ్డాడు. అందువల్ల ఈ మ్యాచ్ తర్వాత ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్ లలో రోహిత్ ఆడలేదు. కానీ ఇప్పుడు తాజాగా రోహిత్ నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రోహిత్ లేకపోయినా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ముంబై రాజస్థాన్ రాయల్స్‌తో ఓడిపోయింది. అయితే ఈ రెండు మ్యాచ్ లకు ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహించాడు. కానీ ఇప్పుడు రోహిత్ గాయం నుండి కోలుకోవడంతో ఆ జట్టు రేపు బెంగుళూరుతో ఆడే మ్యాచ్ లో మళ్ళీ అతను కనిపించనున్నట్లు సమాచారం.