తెలుగులోకి బాలీవుడ్ హిట్ సినిమా !

తెలుగులోకి బాలీవుడ్ హిట్  సినిమా !

ఒక భాషలో హిట్టైన సినిమాలను మరొక భాషలోకి రీమేక్ చేయడం మామూలు విషయమే.  కానీ హిందీ సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడం కొంచెం తక్కువగానే జరుగుతుంటుంది.   ప్రస్తుతం 2017లో విడుదలై మంచి విజయంగా నిలిచిన 'బారెయిలీ కి బర్ఫీ' చిత్రాన్ని తెలుగులోకి రీంక్ చేయనున్నారని తెలుస్తోంది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.  మల్టీస్టారర్ గా ఉండనున్న ఈ సినిమాలో ఒక స్టార్ హీరో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.  త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.