షిప్ యార్డ్ ప్రమాద ఘటన : 11 కు చేరిన మృతుల సంఖ్య

షిప్ యార్డ్ ప్రమాద ఘటన : 11 కు చేరిన మృతుల సంఖ్య

విశాఖను వ‌రుస ప్ర‌మదాలు వెంటాడుతూనే ఉన్నాయి. విశాఖను ప్రకృతి పగబట్టిందా అన్నట్టు ఓవైపు గ్యాస్ లీక్‌లు, అగ్నిప్ర‌మాదాలు ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తుండ‌గా.. ఇవాళ విశాఖ షిప్ యార్డులో భారీ ప్ర‌మాదం జ‌రిగింది. ఉన్నట్టుండి యార్డులో ఉన్న క్రేన్ విరిగిపడటంతో 10 మంది మృతిచెందారు.. ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఆరుగురు మృతిచెంద‌గా.. మ‌రో న‌లుగురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన‌ట్టుగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నుండి అందుతున్న సమాచారం మేరకు షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో 11కు మృతుల సంఖ్య చేరింది.

మృతుల్లో నలుగురు షిప్ యార్డ్ ఉద్యోగులు, ఏడుగురు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు చెబుతున్నారు. షిప్ యార్డ్ యాజమాన్యం నుంచి ఒక కమిటీని , జిల్లా అధికార యంత్రాంగం తరపున ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందిస్తామని పేర్కొన్న ఆయన ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసిందని పేర్కొన్నారు. క్రేన్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్టుగా భావిస్తున్నారు.