సుప్రీం కాదంటే రణమే-వీహెచ్‌పీ

సుప్రీం కాదంటే రణమే-వీహెచ్‌పీ

ఆయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రాకపోతే ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించింది విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)... పార్లమెంటులో చట్టాన్ని తీసుకువచ్చేలా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొస్తామని వెల్లడించారు వీహెచ్‌పీకి కొత్తగా ఎన్నికైన అంతర్జాతీయ అధ్యక్షుడు వీఎస్ కోక్జే... సుప్రీంకోర్టు ప్రతికూలమైన తీర్పును ఇచ్చినట్లయితే అయోధ్యలోని రామాలయ నిర్మాణాన్ని సులభతరం చేసేందుకు వీలుగా ఒక చట్టాన్ని డిమాండ్ చేయాలని హిందువులు ఆందోళన చేస్తామన్న ఆయన... కోర్టు తీర్పు తమ విశ్వాసాన్ని దెబ్బతీస్తే పార్లమెంటులో చట్టాన్ని చేయడానికి స్థానిక ఎంపీలపై ప్రజల నుంచి ఒత్తిడి తెస్తామన్నారు. 

ఆరు నుంచి ఏడు నెలల్లో సుప్రీంకోర్టు రామాలయానికి అనుకూలమైన తీర్పును వెల్లడించాలని కోరారు వీహెచ్‌పీ అధ్యక్షుడు... ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలలో అలాంటి చట్టాన్ని పార్లమెంటులో ఎందుకు ఆమోదించలేదని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోలేదన్నారు కోక్జే. నెమ్మదిగా, స్థిరమైన మరియు ప్రామాణిక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కాగా ఈ కేసులో సుప్రీంకోర్టులో తదుపరి విచారణ ఈ నెల 15వ తేదీన జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన కోక్జే...  గత నెల విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.