హిందువుల్లో సహనం నశిస్తోంది..

హిందువుల్లో సహనం నశిస్తోంది..

అయోధ్యలోని రాంమందిర్-బాబ్రీ మసీదు కేసు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చి వాయిదా పడిన వెంటనే... కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. హిందువుల్లో అసహనం పెరిగిపోతోందని, ఈ అసహనం మరింత పెరిగితే ఎక్కడికి దారితీస్తుందోనన్న భయం కలుగుతోందని ఆయన అన్నారు. 

అయోధ్య స్థల వివాదాన్ని కాంగ్రెస్ హిందూ-ముస్లిం ఇష్యూగా చూస్తోందని, దీంతో హిందువుల్లో అసహనం పెల్లుబుకుతోందన్నారు. ఆయన మాట్లాడిన వెంటనే ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు.