లైలా వెంటపడిన ధావన్

లైలా వెంటపడిన ధావన్

ఐపీఎల్‌ ముగిసిన తరువాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ క్వారంటైన్‌ను పూర్తిచేసుకొని భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. అయితే ప్రాక్టీస్ మధ్యలో సరదాగా శిఖర్ ధావన్, పృథ్వీషాలు ఓ హిందీ పాటకు డాన్స్ చేశారు. అందులో లేడీగా పృథ్వీషా వగలు చూపితే అతడి వెనుకే ధావన్ వెళుతూ టీజ్ చేస్తున్నాట్లు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను శిఖ్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. దానికి ఈ లైలా నాకు పిచ్చెక్కిస్తుంది అంటూ కాప్షన్ కూడా ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌కు ఇంకా వారం రోజుల గడువు ఉండటంతో ఆటగాళ్లు జాలీగా ప్రాక్టేస్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో ఫైనల్ వరకూ తన జట్టును తీసుకేళ్లిన శిఖర్ ఆసీస్ మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడా అని అభిమానులు వేచి చూస్తాన్నారు. కొందరు మాత్రం శిఖర్ తన అభిమానులను నిరాశపరచడని మంచి కాన్ఫిడెంట్‌తో ఉన్నారు.