బీజేపీ పిటిషన్.. ఎస్‌ఈసీ తదుపరి స్టెప్ మీద సర్వత్రా ఆసక్తి !

బీజేపీ పిటిషన్.. ఎస్‌ఈసీ  తదుపరి స్టెప్ మీద సర్వత్రా ఆసక్తి !

కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ స్టే లేదు కాబట్టి పరిషత్ ఎన్నికల నిర్వహణపై నోటిఫికేషన్‌ జారీ చేసేసింది ఎస్‌ఈసీ. అనుకున్న విధంగానే.. ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌పై మాలీ కోర్టులో కేసులు పడ్డాయి. ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశాక.. దాన్ని కోర్టు కూడా ఆపలేదనే వాదనను బలంగా తెరపైకి తెస్తున్నాయి అధికార వర్గాలు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ద్వారా ఎన్నికలను అడ్డుకుని తీరతామని దిశగా పిటిషన్ వేసింది బీజేపీ. ఇప్పుడు ఎస్‌ఈసీ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా ఎస్‌ఈసీ ఏం చేసినా.. ఏం చేయాలనుకున్నా.. ప్రతి అంశమూ కోర్టు పరిధిలోకి వెళ్తోంది. తాజాగా కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ బాధ్యతలు తీసుకున్న వెంటనే పాత ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం నిలిచిపోయిన పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలంటూ కొత్త నోటిఫికేషన్‌ జారీ చేశారు.

నిన్న రాత్రి నోటిఫికేషన్‌ ఇలా జారీ చేయగానే సదురు నోటిఫికేషన్ను సవాల్‌ చేస్తూ శుక్రవారం ఉదయానికల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది బీజేపీ. దీంతో ఎన్నికల ప్రక్రియ ఏమవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కొత్తగా కోర్టులో పిటిషన్‌ దాఖలైన.. గతంలో ఉన్న పిటిషన్లు కోర్టులో పెండింగులో ఉన్నా.. మొదలైన ఎన్నికల ప్రక్రియ ఆగడమనేది ప్రస్తుతం కుదరని పని అనేది ఎస్‌ఈసీ వర్గాల వాదన. ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాక కోర్టులు సహజంగా జోక్యం చేసుకునే అవకాశాలు ఉండవనే స్పష్టం చేస్తున్నాయి ఎస్‌ఈసీ వర్గాలు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు కోర్టుల నుంచి ఎలాంటి ఆదేశాలు కానీ.. స్టే కానీ లేదని.. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసే అంశంలో సాంకేతికపరమైన ఇబ్బందులేవీ ఉండవనేది ఎస్ఈసీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.