తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హై కోర్టు ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హై కోర్టు ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వంపై హై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.  తాము అడిగిన వివరాలేవీ ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడింది హై కోర్టు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదని ఫైర్ అయింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ పై చర్యలు తీసుకోవాలని చెప్పినా ఎందుకు తీసుకోలేదని పేర్కొంది హై కోర్టు.  పబ్ లు, బార్లపై క్లబ్ లపై చర్యలు ఏమయ్యాయి ? హై కోర్టు సీరియస్ అయింది.  మీకు ఆదాయమే ముఖ్యమా ? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హై కోర్టు. ఆర్టీపీసీఆర్ టెస్టులపై వివరాలు లేవని పేర్కొంది. 14 అదనపు సెంటర్లకు అనుమతి అన్నారు.. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ? అని ప్రశ్నించింది హై కోర్టు. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశించింది.