జమునా హ్యాచరీస్ పిటిష‌న్‌.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు

జమునా హ్యాచరీస్ పిటిష‌న్‌.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు

తన ఫ్యామిలీకి చెందిన జమునా హ్యాచరీస్ వ్య‌వ‌హారంలో హైకోర్టును ఆశ్ర‌యించారు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీష్‌ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్ల‌బోద‌ని హైకోర్టు పేర్కొంది.. ఆ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్ప‌ష్టం చేసిన హైకోర్టు.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వాలని సూచించింది. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలంటూ సంచ‌ల‌న కామెంట్లు చేసింది.. అయితే, శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వమనేలా ఉండకూడదని ఘాటుగా స్పందించిన హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఇక‌, ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి...