ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

ఈనెల 8న జరిగే ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏర్పాట్లు ను పరిశీలిస్తున్నారు. 8న ఉదయం 11గంటల 49 నిమిషాలకు జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి సుమారు 5వేల మంది హజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వీలుగా ప్రాంగణంలో ఎల్‌ఈడీలను ఏర్పాటు చేయనున్నారు. ఎంట్రీ పాసులున్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతిస్తారు. మరోవైపు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి అదనపు బలగాలను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రప్పిస్తున్నారు.