బ్రేక్ తీసుకొని మళ్ళీ బిజీ అవుతున్నబ్యూటీలు

బ్రేక్ తీసుకొని మళ్ళీ బిజీ అవుతున్నబ్యూటీలు

టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని సినిమాలకు దూరం అయ్యారు. కొంతమంది పెళ్లితర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు. కొంత మంచి ముద్దుగుమ్మలు  కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకోని మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతున్నారు. సన్నజాజి తీగ లా ఉండే శ్రియాకి పెళ్లయ్యాక సినిమాలు తగ్గిపోయాయి. రెండేళ్ల క్రితం వచ్చిన 'గాయత్రి' తర్వాత శ్రియా మళ్లీ కనిపించలేదు. 'ఎన్టీఆర్-కథానాయకుడు'లో ఒక స్పెషల్‌ సాంగ్‌ మాత్రమే చేసింది. అయితే ఇప్పుడు శ్రియా రెండు సినిమాలతో బిజీగా ఉంది. 'గమనం'తో టాలీవుడ్‌ మోస్ట్‌ అవైటడ్ మూవీ 'ట్రిపుల్‌ఆర్'లో కీ రోల్‌ ప్లే చేస్తోంది శ్రియా. అలాగే పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించి టీవీషోస్‌ చేసుకుంటోన్న ప్రియమణి మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. 2018లో వచ్చిన 'మన ఊరి రామాయణం' తర్వాత కనిపించని ప్రియమణి ఇప్పుడు వెంకటేశ్, రానా ఇద్దరితో సినిమాలు చేస్తోంది. 'నారప్ప'లో వెంకటేశ్ జోడీగా నటిస్తోన్న ప్రియమణి, రానా 'విరాటపర్వం'లో కామ్రేడ్‌ భారతక్కగా పోరాటం చెయ్యబోతోంది. లవర్‌ కోసం సినిమాలు మానేసి, మూడేళ్లు బ్రేక్‌ తీసుకున్న శ్రుతీ హాసన్‌ బ్రేకప్‌ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. 'కాటమరాయుడు' తర్వాత తెలుగులో కనిపించని శ్రుతీ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తోంది. రవితేజతో 'క్రాక్', పవన్‌ కళ్యాణ్‌తో 'వకీల్‌సాబ్‌' సినిమాలు చేస్తోంది శ్రుతీ హాసన్.చిన్న సినిమాలతో కొంత కాలం హంగామ చేసిన పూర్ణ, తర్వాత టీవీ షోస్‌కి వెళ్లిపోయింది. అయితే సిల్వర్‌ స్క్రీన్‌లో బ్రేక్‌ తీసుకుని స్మాల్‌ స్క్రీన్‌తో నెట్టుకొస్తోన్న పూర్ణకి ఇప్పుడు భారీ ఆఫర్‌ వచ్చింది. బాలక్రిష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో పూర్ణని ఒక హీరోయిన్‌గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.తెలుగునాట సీనియర్‌ హీరోలకి హీరోయిన్ల సమస్యలున్నాయి. ఏజ్‌ గ్యాప్‌ ఉందని స్టార్ హీరోయిన్లు సీనియర్లతో స్టెప్పులెయ్యడానికి ఆసక్తి చూపించట్లేదు. అందుకే బాడీ లాంగ్వేజ్‌కి సెట్‌ అవుతారని, బ్రేక్‌లో ఉన్న హీరోయిన్లకి కూడా పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.