చీరకట్టులో పల్టీలు కొట్టిన అదాశర్మ

చీరకట్టులో పల్టీలు కొట్టిన అదాశర్మ

పూరి జగన్నాథ్ 'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన భామ ఆదా శర్మ. ఆ తరువాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది. కేవలం గ్లామర్ ప్రజెంటేషన్ కోసం చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాల సంగతేమో కానీ అదా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం హీరోయిన్‌ అదాశర్మ చీరకట్టులో పల్టీలు కొట్టింది. సముద్రతీరంలో ఆమె చేసిన విన్యాసాలను చూపిస్తూ ఓ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.