త్వరలో పెళ్లిపీటలెక్కనున్నమరో హీరో

త్వరలో పెళ్లిపీటలెక్కనున్నమరో హీరో

కరోనా పుణ్యమో లేక అలా కలిసొచ్చిందో తెలియదు కానీ ఈ ఏడాది టాలీవుడ్ లో పెళ్లి బాజాలు గట్టిగా  వినిపించాయి .  ఎప్పుడు సినిమాలతో బిజీ బిజీ గా గడిపే హీరోల గాలి ఈ ఏడాది పెళ్లి వైపు మళ్లింది. ఇప్పటికే దగ్గుబాటి రానా ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. రానా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురుచూసిన  ఆయన అభిమానులకు సడన్ సర్పరైజ్  ఇచ్చాడు రానా . తాను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేయడం , ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం , పెళ్లి జరిగిపోవడం అంతా చకచకా జరిగిపోయాయి. మరో యంగ్ హీరో నితిన్ కూడా పెళ్లిపీటలెక్కాడు, అదేవిధంగా యంగ్ హీరో నిఖిల్ కూడా తాను ప్రేమించి అమ్మాయిని పెళ్లాడాడు. మెగాస్టార్ ఇంట కూడా పెళ్లిబాజాలు వినిపించనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ కూడా జరిగి పోయింది. త్వరలో పెళ్లి కబురుకూడా వినిపించనుంది. ఇదిలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మరో హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నడని తెలుస్తుంది.  లవర్ బాయ్ తరుణ్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం తనకు కాబోయే భార్య కుటుంబ సభ్యులతో మాటా మంతీ జరుపుతున్నారట. త్వరలోనే తరుణ్ పెళ్లి కబురు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక తరుణ్ సినిమాలు మానేసి చాలా కలం అయ్యింది. ఆ మధ్య  ఒకటి రెండు సినిమాల్లో నటించిన అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి.