రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యపరిస్థితి పై జీవిత ప్ర‌క‌ట‌న‌...

రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యపరిస్థితి పై జీవిత ప్ర‌క‌ట‌న‌...

కరోనా మహమ్మారి  సామాన్యులనుండి సెలబ్రెటీలు వరకు అందరిని వణికిస్తోంది. అయితే ఈ మధ్యే హీరో రాజశేఖర్, జీవిత కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా అని నిర్ధారణ కావడంతో రాజశేఖర్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే... జీవిత హోమ్ ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు . అయితే వీరిలో కరోనా ప్రభావం రాజశేఖర్ కు ఎక్కువ ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. గత కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన కుమార్తె శివాని తన తండ్రికోసం ప్రార్ధన చేయండి అంటూ ట్విట్ చేయడం అభిమానులకు మరింత ఆందోళన కలిగించింది. వైద్యులు కూడా ఆయ‌న‌కు ప్లాస్మా థెర‌పీ ఇచ్చిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్లు బులిటెన్ విడుద‌ల చేశారు. తాజాగా రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యంపై ఆయ‌న భార్య జీవిత కీలక ప్రకటన చేసారు. గ‌త మూడు రోజులుగా ఆయ‌న ఆరోగ్యం కుదుటపడుతుందని, ఇప్పటికే 80శాతం వ‌ర‌కు ఇన్ఫెక్ష‌న్స్ త‌గ్గిన‌ట్లు చెప్పారు. దాంతో మరో రెండు రోజుల్లో ఆయన ఐసీయూ నుండి బయటకు వచ్చే అవ‌కాశం ఉంద‌ని, మేము ప్ర‌తి రోజు ఆయన ఆరోగ్యపరిస్థితి పై డాక్ట‌ర్స్ తో మాట్లాడుతున్నాము అని జీవిత చెప్పారు.