నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్... ఎప్పుడంటే 

నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్... ఎప్పుడంటే 

టాలీవుడ్ హీరో నితిన్ వివాహం షాలిని తో ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ లో జరగనుంది. అయితే ఫిబ్రవరి లోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దుబాయ్ లో ఏప్రిల్ నెలలో పెళ్లి అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడిన చాలా పెళ్లిళ్లలో నితిన్ పెళ్లి కూడా ఉంది. అయితే కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోయినా నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి మాత్రం తొందరగా ఈ వివాహం చేసేయాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఈ నెల 26 సాయంత్రం వివాహ మహోత్సవ తేదీని ఖరారు చేసారు. అయితే ప్రస్తుతం మళ్ళీ లాక్ డౌన్ విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ నేపధ్యంలో నితిన్ వివాహం ఏదైనా కళ్యాణ మంటపం, ఫార్మ్ హౌస్, ఇంటి దగ్గర లేదా హోటల్ లో అనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. కానీ వివాహం జరిగే  తేదీ మాత్రం నిర్ణయించారు. చూడాలి మరి పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అనేది.