పిల్లల్ని కానకపోవడం పై  స్పందించిన అనుష్క...

పిల్లల్ని కానకపోవడం పై  స్పందించిన అనుష్క...

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి బాలీవుడ్  హీరోయిన్ అనుష్క శర్మకి 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం జరిగింది. అంటే దాదాపు వీరి పెళ్లి జరిగి 3 సంవత్సరాలు కావస్తుంది. కానీ వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు పిల్లల్ని కనలేదు. ఈ విషయం పై తాజాగా అనుష్క స్పందించింది. కరోనా కారణంగా కోహ్లీకి మ్యాచ్లు అనుష్కకి షూటింగ్స్  లేకపోవడంతో ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయం లో కోహ్లీ చాలాసార్లు సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసాడు కానీ అతని భార్య మాత్రం ఈ మధ్యే చేసింది. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇక అందులో కోహ్లీకి ఏమంటే ఇష్టంలేదు అని ఓ అభిమాని ప్రశ్నించగా.. దానికి అనుష్క ఓడిపోవడం అంటే మా ఆయనకు ఇష్టం లేదు'' అని చెప్పింది. పిల్లలను ఎప్పుడు కంటారు. ఈ విషయం గురించి మిమ్మల్ని ఎవరూ అడగటంలేదా..? అని మరో అభిమాని  అడగ్గా.. "లేదు. ఎవరూ అలా అడగటం లేదు. నెటిజన్లు మాత్రమే అడుగుతున్నారు' అని సమాధానం ఇచ్చింది.