తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం..!

తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం..!

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కార‌ణంగా తెలుగు రాష్ట్రాలలో గ‌త రెండు రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతున్నాయి. దాంతో ఇప్పటికే వాగులు,నదులు నిండి పొర్లుతున్నాయి. మరికొన్ని రోజులపాటు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక తాజాగా తెలంగాణాలో రికార్డుస్థాయిలో 27 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరులో 27.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మరోవైపు వరంగల్ రూరల్‌లో 22 నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం, సిద్దిపేట జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఓవైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది.