హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్..!

హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్..!

హైదరాబాద్‌లో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. ఉరుములు, మెరుపుల‌తో కూడిన‌ భారీ వ‌ర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది... ముఖ్యంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, ఎస్ఆర్ న‌గ‌ర్‌, పంజాగుట్ట లాంటి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది.. ఇక, నాంప‌ల్లి, అబిడ్స్‌, కోఠి, బ‌షీర్‌బాగ్‌, ఖైర‌తాబాద్‌, మెహ‌దీప‌ట్నం, అత్తాపూర్‌, షేక్‌పేట‌, అఫ్జల్‌గంజ్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, స‌రూర్‌న‌గ‌ర్‌, వ‌న‌స్థలిపురం, మ‌ల‌క్‌పేట‌, సైదాబాద్‌, చంపాపేట్‌, నారాయ‌ణ‌గూడ‌, హిమాయ‌త్‌న‌గ‌ర్‌, ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ ఇలా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులుకు కురిశాయి. ఇక, ఆఫీసు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో... పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.