భాగ్యనగరంలో భారీ వర్షం..!

భాగ్యనగరంలో భారీ వర్షం..!

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బలమైన ఈదురు గాలులతో పడిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. అమీర్ పేట్‌, పంజాగుట్ట‌, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సోమాజిగూడ‌, అబిడ్స్, దిల్‌సుఖ్ న‌గ‌ర్, కోఠి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీన‌గ‌ర్‌, తార్నాక‌, ఉప్ప‌ల్‌, సికింద్రాబాద్‌, బోయిన్ ప‌ల్లి, తిరుమ‌ల‌గిరి, మారేడ్ ప‌ల్లి, బేగంపేట‌, ఖైర‌తాబాద్, కూక‌ట్ ప‌ల్లి, మియాపూర్‌ల‌లో బారి వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కు సైతం అంతరాయం ఏర్పడింది.