వాక్సిన్ తీసుకునే వారు కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే !

వాక్సిన్ తీసుకునే వారు కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే !

చైనాలో పుట్టిన క‌రోనా 2.0 యూత్‌ను టార్గెట్ చేసింది మ‌హ‌మ్మారి.. ముఖ్యంగా 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల వయసు వారికి ఎక్కువగా కరోనా సోకుతుండడంతో... ఆ ఏజ్ గ్రూప్‌కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.. ఇప్ప‌టికే 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సిన్ ప్ర‌క్రియ కొన‌సాగుతుండ‌గా.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి కూడా వ్యాక్సిన్ అందించ‌నున్నారు.. అయితే, దీనికి రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి.. ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యింది.. www.cowin.gov.in వెబ్‌సైట్‌లో లేదా ఆరోగ్య సేతు యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది ప్రభుత్వం.  అయితే కరోనా టీకా వేసుకొనే వారు కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

జాగ్రత్తలు :

వాక్సిన్ వేయించుకునే ఒక రోజు ముందు 6 గంటల పాటు మంచిగా నిద్ర పోవాలి
వాక్సిన్ వేసుకున్న తర్వాత.. నొప్పులు ఉంటే.. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకోకూడదు
కుడి చేతి వాటం ఉన్నవాళ్లు ఎడమ చేయికి.. ఎడమ చెయ్ వాటం ఉన్నవాళ్లు కుడి చేయికి వాక్సిన్ వేసుకోవాలి.
వాక్సిన్ వేసుకునే వారు స్టేరైడ్స్ వాడకూడదు
మరీ ముఖ్యంగా వాక్సిన్ వేసుకున్న రోజు... ఆల్కహాల్, దూమపానం చేయకూడదు.
వాక్సిన్ వేసుకునే రోజు కొంచం లూజ్ గా ఉన్న డ్రెస్స్ వేసుకోవాలి
అంతేకాదు.. వాక్సిన్ వేసుకొనే రోజు.. మంచి నీళ్ళు బాగా తాగాలి
వాక్సిన్ వేసుకొనే టైం లో నవ్వుతే.. ఆ పెయిన్ అసలు తెలియదు