ఇలా ప్రతి రోజు చేస్తే..గుండె జబ్బులకు చెక్

ఇలా ప్రతి రోజు చేస్తే..గుండె జబ్బులకు చెక్

నోరు, దంతాలు శుభ్రంగా ఉండకపోతే రక్తంలో బ్యాక్టీరియా పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో సైంటిస్టులు పరిశోధనల్లో పేర్కొన్నారు. అందుకనే వైద్యులు నోరు,  దంతాలను సురక్షితంగా ఉంచుకుంటే గుండె జబ్బులు రావని చెబుతుంటారు. అయితే నిత్యం 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు బ్రష్ చేస్తే...దాని ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. దక్షిణ కొరియాలోని కొరియన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్సు సిస్టమ్స్ కు చెందిన 40 నుంచి 79 యేండ్ల మధ్య వయసు ఉన్న 1,61, 286 మందిపై అక్కడి సైంటిస్టులు 10 ఏళ్ళ పాటు అధ్యయనం చేశారు.

ఆ సమయంలో వారి ఎత్తు, బరువు, వారికున్న అనారోగ్య సమస్యలు, జీవన విధానం, దంతాలు, నోటి ఆరోగ్యం,తదితర వివరాలను సేకరించారు.  ఈ క్రమంలో అన్ని వివరాలను విశ్లేషించి చివరకు సైంటిస్టులు తేల్చిందేమిటంటే...నిత్యం 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు బ్రష్ చేసిన వారికి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు 12 శాతం వరకు తగ్గుతాయని, ఆలాగే ఆట్రియల్ వంటి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 10 శాతం వరకు తక్కువని పేర్కొన్నారు సైంటిస్టులు.