లక్షణాలు లేని వాళ్ళ వల్లే ఎక్కువగా కరోనా వ్యాప్తి..

లక్షణాలు లేని వాళ్ళ వల్లే ఎక్కువగా  కరోనా వ్యాప్తి..

వరదలు, కరోనాపై పరిస్థితులపై హెల్త్ డిపార్ట్మెంట్  అలర్ట్ అయింది. ఈ మేరకు కోఠిలో  హెల్త్ డిపార్ట్మెంట్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడారు.  రాష్ట్రంలో కరోనా, వరదలు రెండు సమస్యలు ఉన్నాయని దీంతో Ghmc చుట్టూ పక్కల ప్రాంతాలు సఫర్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఏడెనిమిది నెలలుగా 0.57 శాతం డెత్ రేట్.. సుమారు 90 శాతం రికవరీ రేట్..22 వేల కరోనా యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.  అందులో 4 వేల మంది హాస్పిటల్స్ లో ఉన్నారని..38 లక్షల పైగా టెస్ట్ లు చేసామని వెల్లడించారు. పండగల సీజన్ ఇప్పుడు.. వరుసగా ఉన్నాయని..రాష్ట్రంలో ఇతర జిల్లాలో పండగ వాతావరణం ఎక్కువ అని తెలిపారు. రాష్ట్రంలో 15 వందల కంటే తక్కువగా కేసులు వస్తున్నాయని.. Ghmc పరిధిలో 200 వరకు మాత్రమే కేసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 
డిసెంబర్ వరకు కీలకమైన రోజులని..షాపింగ్, ఇతర ప్రాంతాలకు వెళ్లడం, పండగ చేసుకోవడం...  వీటి ద్వారా ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అవుతుందని తెలిపారు. లక్షణాలు లేని వాళ్ళ  వల్ల కరోనా స్ప్రెడ్ ఎక్కువగా ఉందన్నారు. దీనికి కేరళ, ఢిల్లీ ప్రత్యేక్ష సాక్ష్యమన్నారు. కేరళలో జరిగిన ఓనమ్ పెస్టివల్ వల్ల కేసులు 10 వేల కేసులు పెరిగాయని..పండగ చేసుకోవద్దని చెప్పడం లేదు.. కుటుంబ సభ్యులతో చేసుకోండి అని పేర్కొన్నారు. చలి కాలం అన్ని వైరస్ లకు అనువైన కాలం.. బాగా స్ప్రెడ్ అవుతుందని హెచ్చరించారు.  కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలీదు.. వచ్చినా ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలీదని పేర్కొన్నారు. అందుకే స్పెషల్ క్యాంపెయిన్ ను ప్రారంభించామని..సోషల్ మీడియా, రేడియో లలో ప్రకటనలు ఇస్తున్నామన్నారు. Ghmc లో ఆరోగ్య శాఖ కూడా పని చేస్తోందని..నీళ్లు, ఆహారం, దోమల వల్ల వచ్చే జబ్బులు అరికట్టడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.