ఈ టీ తో కరోనా చెక్...!!!

ఈ టీ తో కరోనా చెక్...!!!

కరోనా రోజు రోజుకు దేశంలో విస్తరిస్తోంది. పైగా ఇది వర్షాకాలం.  సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.  జలుబు, దగ్గు, జ్వరం వంటివి షరా మాములుగా వస్తుంటాయి.  కరోనా కాలంలో జలుబు దగ్గు వచ్చినా భయపడిపోతున్నాం.  మాములు జ్వరమో లేక కరోనాలో తెలియక ఆందోళన చెందుతున్నాం.  శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెప్తున్నారు.  

రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్ధాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని రకాల టీల ద్వారా కూడా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉల్లితో తయారు చేసిన టీ తాగడం వలన కూడా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు.  ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు.  గుండె జబ్బులు ఉన్న వాళ్లకు ఉల్లి మేలు చేస్తుంది.  అలానే ఉల్లితో తయారు చేసిన టీ తాగడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగమే కాకుండా, ఈ వర్షాకాలంలో  సీజనల్ గా వచ్చే జ్వరం, జలుబు వంటివి వాటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.  ఈ టీ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది.