బన్నీ డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అంటున్న బాలీవుడ్ హీరో

బన్నీ డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అంటున్న బాలీవుడ్ హీరో

బాలీవుడ్ యువ హీరోల్లో బెస్ట్ యాక్షన్ హీరోగా టైగర్ ష్రాఫ్ ఉన్నాడు. అతడి డాన్స్‌లు, ఫైట్‌లు అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటితోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే అతడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అట. అంతేకాకుండా బన్నీ సినిమాను రీమేక్ చేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా తాను మర్చిపోలేని మధుర జ్ఞాపకం అని టైగర్ చెప్పుకొచ్చాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన పరుగు సినిమాను హిందీలో హీరోపంటి పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే టైగర్ హిందీలోకి అరంగేట్రం చేశాడు. ఆ సినిమాలోనే చేజింగ్‌లు, డాన్స్‌లతో టైగర్ అందరిని మెప్పించాడు. అయితే టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు. అదే తరహాలో అల్లు అర్జున్‌లో మీకు నచ్చే అంశాలు ఏంటని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. అల్లు అర్జున్‌ డాన్స్ స్టైల్ అంటే తనకు చాలా ఇష్టం అని బన్నీ డాన్స్‌కు బీటౌన్‌లో చాలా మంది ఫ్యాన్స్ అని చెప్పాడు. బాలీవుడ్‌లో బన్నీ డాన్స్‌కు ఉన్న ఫ్యాన్స్ చాలా మంది ఇదేవిధంగా మాట్లాడుతారు. అంతేందుకు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా బన్నీ, ఎన్‌టీఆర్ డాన్స్‌లకు అభిమానినని చాలా సార్లు చెప్పాడు. దీంతో ప్రస్తుతం టైగర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు టైగర్ అభిమానులు, ఇటు బన్నీ అభిమానులు కూడా ఈ వీడియోను షేర్లు చేస్తున్నారు.