"ఆయనకు ఓట్లు తప్ప ప్రజలు పట్టరు"

"ఆయనకు ఓట్లు తప్ప ప్రజలు పట్టరు"

ప్రజల ప్రాణాలు పట్టవని, అదే ఆయనకు గుర్తొస్తే.. ఇవాళ జగిత్యాల మీటింగ్ లో కేసీఆర్ కొండగట్టు మృతుల గురించి ప్రస్తావించి ఉండేవారని జగిత్యాల బరిలో మహాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవమేమో గానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న జీవం తీసేస్తోందన్నారు. ఎస్సారెస్పీ నీటిని అక్రమంగా తరలిస్తూ జగిత్యాల ఆయకట్టు రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. నిన్నటిదాకా ఆంధ్రా పాలకులు  తెలంగాణను దోపిడీ చేస్తే నేడు తెలంగాణ పాలకులే దోచుకుంటున్నారన్నారు. తెలంగాణ వస్తే దళితుణ్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ పొలిటికల్ కరెప్షన్ కు పాల్పడ్డారన్నారు జీవన్ రెడ్డి.