శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం.. ప‌వ‌ర్ బ్యాక‌ప్‌, నెట్ ఖ‌ర్చు కూడా..!

శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం.. ప‌వ‌ర్ బ్యాక‌ప్‌, నెట్ ఖ‌ర్చు కూడా..!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌తీ దేశాన్ని, ప్ర‌తీ ఊరిని ట‌చ్ చేసి పోతాన‌న్న రీతిలో విజృంభిస్తూనే ఉంది.. ల‌క్ష‌ల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి.. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు.. ఇక‌, ఉద్యోగుల వ‌ర్కింగ్ స్టైల్‌ను కూడా మార్చేసింది క‌రోనా వైర‌స్.. పేరుమోసిన సంస్థ‌ల నుంచి చిన్నా చిత‌క కంపెనీల వ‌ర‌కు వ‌ర్క్‌ఫ్రం హోం ఇచ్చేశాయి.. మ‌రికొన్ని కంపెనీలు అయితే, వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఇంట్లోనే కూర్చొని ప‌నిచేయండి అంటున్నాయి.. ఈ స‌మ‌యంలో హిందూస్తాన్ కోకాకోలా బ్రీవరేజెస్ కార్పొరేషన్ ( హెచ్‌సీసీబీ) సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. తన ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ప్ర‌క‌టించిన ఆ సంస్థ‌.. కరోనా త‌ర్వాత కూడా వ‌ర్క్‌ఫ్రం హోం విధానంల అమ‌లులో ఉంటుంద‌ని పేర్కొంది.. అయితే, ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు క‌ల్పించింది. 

వ‌ర్క్‌ఫ్రం హోం ఉద్యోగుల‌కు స‌దుపాయాలు కూడా క‌ల్పించ‌నుంది ఆ సంస్థ‌.. వర్క్ ఫ్రం హోం ఎంచుకున్న ఉద్యోగులకు... బెంగళూరులోని తమ ప్రధాన కార్యాలయం నుంచి ఆయా సామాగ్రిని వారి ఇళ్లకు బదిలీ చేసింది. తమతమ నగరాలలో పనిచేయాలనుకునే ఉద్యోగులకు ఈ కుర్చీలను కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇక‌, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇవ్వ‌నుంది. యుపీఎస్‌ లేదా పవర్‌ బ్యాకప్‌ సహా నెలవారీ వైఫై ఖర్చుల్లో కూడా హెచ్‌సీసీబీ స‌హాయం చేయ‌నుంది. కుర్చీలు, హెడ్‌ఫోన్లు, ల్యాంప్‌లు, వెబ్‌కామ్‌, ఎక్సటర్నల్‌ మైక్రోఫోన్‌, ఇత‌ర ఎరేంజ్‌మెంట్‌ కోసం కూడా ఉద్యోగులు నగదు స‌హాయం పొందే వెసులుబాటు క‌ల్పించింది. ఇక‌, శారీరక, మాన‌సిక సవాళ్లను అధిగమించేందుకు టెలిమెడిసన్‌ సదుపాయాలతో పాటుగా వెల్‌నెస్‌ కౌన్సిలింగ్‌ను సైతం అందించ‌నుంది హెచ్‌సీసీబీ.