టిసిఎ సెక్రెటరీ పై పరువు నష్ట దావా వేసిన అజారుద్దీన్...

టిసిఎ సెక్రెటరీ పై పరువు నష్ట దావా వేసిన అజారుద్దీన్...

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) సెక్రెటరీ ధరమ్ గురువా రెడ్డి పై పరువు నష్ట దావా వేసిన హెచ్‌సిఎ ప్రసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్.  ఓ ప్రెస్ మీట్ సందర్భంగా గురువా రెడ్డి మాట్లాడుతూ... అజారుద్దీన్ పై ఇంకా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ముగియలేదని ఆరోపించిన గురువా రెడ్డి... ఆయనపై కేసులు రిఓపెన్ చేసి విచారణ చేయాలని అమిత్ షా ని కోరుతున్నామన్నారు. సిబిఐ కేసులున్న వ్యక్తి హెచ్‌సిఎ ప్రెసిడెంట్ గా ఉండే అర్హత లేదని అన్నారు. అయితే గురువా రెడ్డి వాఖ్యలపై నాంపల్లి కోర్టులో పరువునష్ట దావా వేశారు అజారుద్దీన్. గురువా రెడ్డి రెండు కోట్ల పరువు నష్టం వేశారు. అయితే అజారుద్దీన్ పరువునష్ట దావా పై కౌంటర్ ఫైల్ చేయనున్నారు గురువా రెడ్డి.