సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం కేసు :  ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం కేసు :  ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వెంకట్ రావు అదృశ్యం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  మిస్సింగ్ కేసును ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచికి అప్పగించాలని ఆదేశించింది.   వెంకట్ రావు భార్య రాజకుమారి “హెబియస్ కార్పస్” పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు చేసింది.  మే 26 నుంచి కనిపించకుండా పోయిన కానిస్టేబుల్ వెంకట్ రావు...తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లేందుకు సెలవు కోసం ప్రయత్నించాడు. సెలవు మంజూరు కోసం ఢిల్లీ ధౌలాకువాలోని కార్యాలయానికి వెళ్లిన వెంకట్ రావు...ఆ తర్వాత నుంచి అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయ్యాడు. అదృశ్యం వెనుక సీఐఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్ కుమార్‌పై అనుమానాలు వస్తున్నాయి. తరచుగా వెంకట్ రావు సెలవులు కోరడంపై సంజీవ్ కుమార్‌తో గొడవలు జరిగాయని తెలుస్తోంది. స్టేటస్ రిపోర్టులో సీఐఎస్ఎఫ్, ఉస్మాన్‌పూర్ పోలీసులు పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. అయితే... ఈ కేసు సమగ్ర, పారదర్శక విచారణ కోసం ఢిల్లీ క్రైం బ్రాంచికి అప్పగించింది హైకోర్టు.