ఆరో వికెట్ కోల్పోయిన భారత జట్టు...

ఆరో వికెట్ కోల్పోయిన భారత జట్టు...

ఆసీస్ తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు. మరో బ్యాట్సమెన్ రిషబ్ పంత్ 23 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. దాంతో  186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది టీం ఇండియా. మయాంక్ కు ఔట్ చేసిన జోష్ హాజిల్‌వుడ్ పంత్ ను కూడా వెనక్కి పంపాడు. అయితే పంత్ ఔట్ కావడంతో బేటింగ్ చేయడానికి శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే దేశవాళీ క్రికెట్ లో శార్దుల్ కు బ్యాటింగ్ లో మంచి రికార్డు ఉంది. కానీ ఇప్పుడు ఆసీస్ తో మ్యాచ్ లో అతను రాణిస్తాడా.. లేదా అనేది. ఇప్పటికి ఆసీస్ కంటే 183 పరుగులు వెనుకబడి ఉంది భారత జట్టు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.