సోషల్‌ మీడియాకు ఇక సెలవు: యువరాజ్ సింగ్ భార్య

సోషల్‌ మీడియాకు ఇక సెలవు: యువరాజ్ సింగ్ భార్య

టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్ భార్య, బాలీవుడ్‌ నటి హజెల్‌ కీచ్‌ సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు వెల్లడించింది. ‘పూర్తిగా ఒకరిపై ఒకరం ఆధారపడటం అలవాటైన మనకు ఒంటరిగా ఎలా బతికేవాళ్లమో గుర్తుకురావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్‌ తీసుకోవాల్సిందేనని హజెల్‌ కీచ్‌ తెలిపింది. త్వరలోనే నేను, నా మొబైల్ బ్రేక్‌ తీసుకుంటున్నాం అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుందని నాకు తెలుసు, కానీ తప్పదు..! సోషల్‌ మీడియాకు నేను వీడ్కోలు పలుకుతున్నాను. తిరిగి సోషల్‌ మీడియాలోకి వస్తాను, కానీ ఇప్పట్లో రాలేనని తెలిపింది. స్నేహితులు, బంధుమిత్రులెవరూ కూడా తనకు మెసేజ్‌ చేయొద్దని హజెల్‌ కీచ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కోరింది. కాగా హజెల్‌ కీచ్‌ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమములోనే ఆమె మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. కొద్దిరోజులపాటు స్నేహంగా ఉన్న యూవీ-హజెల్‌ కీచ్‌లు ఆ తరువాత ప్రేమగా మారడంతో 2016 నవంబర్‌ 30న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.