రేప్ చేస్తామని భారత క్రికెటర్ భార్యకు బెదిరింపు కాల్స్...

రేప్ చేస్తామని భారత క్రికెటర్ భార్యకు బెదిరింపు కాల్స్...

భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ రెండు సంవత్సరాల మళ్ళీ వార్తల్లో నిలిచింది. తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్బంగా హసీన్ ఓ ట్విట్ చేసింది. అందులో...'' అయోధ్యలో  రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగినందుకు సమస్త హిందువులకి శుభాకాంక్షలు'' అని అందులో పేర్కొంది. ఇక ఆ ట్విట్ చేసిన తర్వాత నుండి తనకు కొందరు ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడుతున్నారు అంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది. హసీన్... నాకు ఫోన్ చేసి రేప్ చేస్తాం, చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని ఆ ఫిర్యాదు‌లో పేర్కొంది. 

ఇక రెండు సంవత్సరాల క్రితం తన భర్త షమీ తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది హసీన్. అలాగే తనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని షమీ ఫిక్సింగ్‌ లకు కూడా పాల్పడడని ఆరోపణలు చేసింది.దాంతో బీసీసీఐ షమీ భార్య చేసిన ఫిక్సింగ్ ఆరోపణలపైనా విచారణ జరిపి అతనికి క్లీన్‌చీట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం షమీ నుంచి వేరుగా ఉంటున్న హసీన్ తన భర్త నుండి నెలకి రూ. 10 లక్షలు భరణం కోరుతూ ఇప్పటికి న్యాయస్థానంలో పోరాడుతుంది.