జగన్ పచ్చి మోసగాడు..మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

జగన్ పచ్చి మోసగాడు..మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ హర్షకుమార్ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులపై దాడులు జారుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆయన జగన్ పచ్చి మోసగాడని ఆరోపించారు. సీఎం అయ్యాక, అవ్వక ముందు ప్రతి చోట రాజధాని అమరావతి, అక్కడే ఉంటుంది, నేను ఇల్లు అక్కేడే కట్టుకున్నాను అని జగన్ చెప్పిన ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. రాజధాని విషయంలోను, దళితుల విషయంలోను జగన్ మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ కి దమ్ముంటే, ఒక్క జిల్లాకి పోల్ కి వెళ్ళాలి,ఈస్ట్ గోదావరి వచ్చి పోల్ పెట్టి చూడమన్న ఆయన జగన్ కు దమ్ము, సిగ్గు ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్ కి వెళ్ళమని మెజార్టీ వస్తే అప్పుడు అమరావతి మార్చమని సవాల్ చేశారు. విజయవాడ అగ్ని ప్రమాదంలో  లక్షలు కట్టి క్వారేంటయిన్ లో ఉండి చనిపోతే 50 లక్షలు ఇచ్చి, ఎస్సై తో కొట్టబడి చనిపోయిన కిరణ్ కి 10 లక్షలు ముష్టి వేస్తావా అని ఆయన ప్రశ్నించారు.