అరుదైన ఘనత సాధించిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌...

అరుదైన ఘనత సాధించిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌...

టీమిండియా బ్యాట్స్‌వుమన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ లక్నో వేదికగా దక్షిణాఫ్రికతో జరిగిన తొలి వన్డే ద్వారా అరుదైన ఘనతను సాధించింది. భారత్‌ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. భారత్‌ తరఫున 100కు ఆ పైగా వన్డేలు ఆడిన క్రీడాకారిణుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. హర్మన్‌ 100 వన్డే మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు 11 హాఫ్‌ సెంచరీలు చేసింది. అందులో ఆమె టాప్‌ స్కోర్‌ 171 పరుగులు. పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా కూడా రాణించే హర్మన్‌.. టెస్ట్‌ల్లో 9, వన్డేల్లో 23, టీ20ల్లో 29 వికెట్లు సాధించింది. అయితే ప్రస్తుతం భారత వన్డే జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ టీ20 జాట్ట్టుకు న్యాయకత్వం వహిస్తుంది.