బ్యాట్ బాగుచేయమని కోహ్లీని అడిగిన ముంబై ఆటగాడు... 

బ్యాట్ బాగుచేయమని కోహ్లీని అడిగిన ముంబై ఆటగాడు... 

యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2020 కోసం అన్ని జట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఈ లీగ్ ప్రారంభానికి ఇంకా 8 రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పటికే తమ క్వారంటైన్ ముగించుకున్న అన్ని జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే మాములుగా ఆటగాళ్లు అందరూ తమ బ్యాట్స్ ను తామే బాగుచేసుకునేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే దానితో గ్రౌండ్ లో ఆడేది వాళ్ళే కాబట్టి . ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దీనికి భిన్నంగా లేడు. విరాట్ తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసాడు. అందులో తానేస్వయంగా తన బ్యాట్ ను బాగుచేసుకుంటున్నాడు. అలాగే బ్యాట్ యొక్క ప్రతి చిన్న విషయం కూడా నాకు కీలకం. నా బ్యాట్ లను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ఇష్టం అని తెలిపాడు. అయితే ఈ వీడియో పై స్పందించిన ముంబై ఇండియన్స్ స్టార్ హార్దిక్ పాండ్యా విరాట్ సహాయం కోరాడు. ''నా బ్యాట్స్ ను ని దగ్గరకు పంపిస్తా.. బాగుచేయవ'' అని అడిగాడు. ఇక యూఏఈ లో 53 రోజులు జరగనున్న ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్ తో ప్రారంభం కానుంది.