నల్లజాతీయుల ఉద్యమానికి మద్దతు తెలిపిన పాండ్యా...

నల్లజాతీయుల ఉద్యమానికి మద్దతు తెలిపిన పాండ్యా...

ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పెట్టిన 196 రన్స్‌ టార్గెట్‌ను ఈజీగా ఛేజ్‌ చేసింది రాజస్థాన్‌ రాయల్స్‌. రాజస్థాన్‌ బాట్స్మెన్ బెన్‌ స్టోక్స్‌ సెంచరీతో అతనికి తోడు శాంసన్‌ అర్ధసెంచరీతో రాణించడంతో జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.  టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌కు మంచి ఆరంభం దక్కలేదు. కానీ చివరి ఓవర్లలో హార్దిక్‌ పాండ్యా రెచ్చిపోయారు. పాండ్యా 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60 రన్స్‌ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్‌ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కంటే అతను చేసిన మరొక పని కారణంగా వార్తలో నిలిచాడు. అర్ధసెంచరీ పుర్తయిన తర్వాత హార్దిక్‌ మొకాళ్ళ పై కూర్చొని నల్లజాతీయుల కోసం జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్ కు మద్దతు తెలిపాడు. దాంతో ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన తొలి ఐపీఎల్ ఆటగాడిగా పాండ్యా నిలిచాడు. ఈ ఘటనతో నెటిజన్లు పాండ్యా  పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.