పాండ్యా కొడుకు పేరును బయటపెట్టిన ఆ కేక్...

పాండ్యా కొడుకు పేరును బయటపెట్టిన ఆ కేక్...

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. తనకు కాబోయే భార్య నటాసా స్టాంకోవిక్  గత నెల 30న పండంటి మగబిడ్డకు జన్మనిచింది. ఈ విషయాన్నిసోషల్ మీడియా వేదికగా ప్రకటించిన పాండ్యా మొదట కేవలం తన కొడుకు చేతిని పట్టుకున్న ఫోటోను మాత్రమే పోస్ట్ చేసాడు. కానీ ఆ తర్వాత జూనియర్ పాండ్యాను ఎత్తుకొని ఉన్న ఫోటోను పోస్ట్ చేసాడు. ఇక పాండ్యా జంట తమ కుమారుడు జన్మించిన ముంబై ఆసుపత్రిలో వైద్యులతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తమ కొడుకును ఈ ప్రపంచం లోకి తీసుక వచ్చినందుకు పాండ్యా,  స్టాంకోవిక్ వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారితో కలిసి కేక్ కట్ చేసారు. అయితే ఇక్కడే ఓ సంఘటన జరిగింది.  అదేంటంటే నటాసా కట్ చేస్తున్న ఆ కేక్ వారి కొడుకు పేరును బయటపెట్టింది. ఆ కేక్ పైన '' వెల్కమ్ జూనియర్ పాండ్యా అగస్త్య'' అని రాసి ఉంది. దాంతో జూనియర్ పాండ్యా పేరు అగస్త్య అని తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని పాండ్యా జంట ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.