అతని రికార్డులు ఒక్కసారి చూడండి : హర్భజన్

అతని రికార్డులు ఒక్కసారి చూడండి : హర్భజన్

ఐపీఎల్ 2020 లో ముంబై టాప్ ఆర్డర్ బాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన యాదవ్ రెండు అర్ధ శతకాలతో కలిపి మొత్తం 281 పరుగులు సాధించాడు. అయితే ఈ ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళాల్సి ఉంది. ఇందుకోసం నిన్న బీసీసీఐ మూడు ఫార్మాట్లలో జట్లను ప్రకటించింది. ఇందులో ఏ జట్టులోను సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం దక్కలేదు. అయితే ఈ జట్లను బీసీసీఐ ప్రకటించిన వెంటనే సూర్యకుమార్ పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది. అంటే చాలా మంచి అతనికి జట్టులో అవకాశం వస్తే బాగుటుంది అనుకున్నారు. ఈ జాబితాలో భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నాడు. తన ట్విట్టర్ లో హర్భజన్ '' సూర్య కుమార్ యాదవ్ భారత జట్టులోకి రావడానికి నిరూపించుకోవడానికి ఇంకేముందో తెలియదు. అతను ప్రతి ఐపీఎల్ సీజన్ మరియు రంజీ సీజన్ లలో అద్బుతంగా రాణిస్తున్నాడు.. అతని రికార్డులను చూడాలని నేను సెలెక్టర్లందరినీ అభ్యర్థిస్తున్నాను'' అని ట్విట్ చేసాడు.