హ్యాపీ బర్త్ డే : డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్...

హ్యాపీ బర్త్ డే : డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్...

భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఈ రోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డ్యాషింగ్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్నాడు సెహ్వాగ్. అతను మైదానంలో ఉంటె పరుగుల వరద  పారాల్సిందే. మ్యాచ్ మొదటి ఓవర్ మొదటి మూడు బంతుల్లోనే మూడు సిక్స్ లు కొట్టిన ఘనత సెహ్వాగ్ సొంతం. 1999 లో పాకిస్థాన్ కు వ్యతిరేంగా భారత వన్డే జట్టులోకి అరంగేట్రం చేసిన సెహ్వాగ్ కు మొదట అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత 2001 లో ఓపెనర్ గా రావడం ప్రారంభించినప్పటినుండి వరసగా పరుగుల వరద పారించడం ప్రారంభించాడు సెహ్వాగ్.

ఇక 2001 లో ఆస్ట్రేలియా కు వ్యతిరేకంగా టెస్ట్ జట్టులోకి వచ్చిన సెహ్వాగ్ తన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ బాదేశాడు. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ లను కూడా వన్డే మ్యాచ్ లాగా ఆడుతూ ఈ లాంగ్ ఫార్మాట్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసాడు. 2004 లో పాక్ కు వ్యతిరేకంగా 309 పరుగులు చేసి భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి భారత ఆటగాడిగా సెహ్వాగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత 2008 లో సౌత్ ఆఫ్రికా పైన 319 పరుగులు చేసి రెండో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

భారత్ తరపున మొత్తం 104 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన సెహ్వాగ్ 49.34 సగటుతో 8,586 పరుగులు చేశారు. అలాగే 251 వన్డే లో 35.0 సగటుతో 8,273 పరుగులు చేశారు. కేవలం 19 టీ 20 మ్యాచ్ లలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన సెహ్వాగ్ 21.9 సగటుతో 394 పరుగులు చేసాడు. ఇక బ్యాట్ తోనే కాకుండా బాల్ తో కూడా భారత జట్టును ఆదుకున్న సెహ్వాగ్ వన్డేల్లో 96 వికెట్లు, టెస్ట్ మ్యాచ్ లలో 40 వికెట్లు తీసుకున్నారు. అలాగే భారత్ గెలిచిన 2007 టీ 20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ జట్లలో సెహ్వాగ్ సభ్యుడిగా ఉన్నాడు. భారత జట్టుకు ఎన్నో సేవలందించిన వీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.