బర్త్ డే స్పెషల్ : ప్రిన్స్ ... సరిలేరు నీకెవ్వరు

బర్త్ డే స్పెషల్ : ప్రిన్స్ ... సరిలేరు నీకెవ్వరు

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నాడు. బాలనటుడిగా వెండితెర పైకి వచ్చిన మహేష్‌.. 1999 లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా మారాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబుకి మంచి గుర్తింపు వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత తన కెరియర్ లో 7 వ సినిమాగా 2003 లో వచ్చిన ఒక్కడు మహేష్ కు స్టార్ డమ్ తెచ్చింది. అదే ఏడాది తేజ దర్శకత్వం లో వచ్చిన నిజం సినిమాతో  మహెష్ బాబు ఉత్తమ నటుడిగా మొదటి నంది పురస్కారం అందుకున్నాడు. వెంటవెంటనే అతడు, పోకిరి వంటి  హిట్స్ అందుకున్న మహేష్ కు మళ్ళీ దూకుడు సినిమాతో హిట్ అందుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇక ఆ తర్వాత నుండి తీసిన 10 సినిమాలో 7 సినిమాలు సూపర్ హిట్ సాధించాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ తనకు ఎవరు సరిలేరు అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ సూపర్ స్టార్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు.  

మొత్తం తన 21 సంవత్సరాల సినీ ప్రయాణం లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మహేష్ ఈ రోజు 45 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫాన్స్ మహేష్ బాబు బర్త్ డే ట్వీట్స్‌తో సోషల్ మీడియా‌ని హోరెత్తిస్తున్నారు. #HBDMaheshBabu ట్యాగ్ ట్విట్టర్ హ్యాండిల్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న కరోనా కారణంగా సామూహిక వేడుకలు జరుపుకోవద్దని మహేష్ బాబు తన అభిమానులకు పిలుపునిచ్చాడు. కాబట్టి బయట జరుపుకొని తన అభిమాన హీరో వేడుకలను సోషల్ మీడియా వేదికగా మహేష్ పేరును ట్రెండ్ చేస్తూ జరుపుకుంటున్నారు.