హ్యాపీ బర్త్ డే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

హ్యాపీ బర్త్ డే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్‌లో ప్రవేశించిన ప్రభాస్ తనదైన శైలిలో రాణిస్తూ అందరి చేత డార్లింగ్ పేరును సొంతం చేసుకొన్నాడు . విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో యంగ్ రెబల్ స్టార్ ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నాడు . నేడు ఈ డార్లింగ్ పుట్టిన రోజు . 2002లో ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2004లో వచ్చిన వర్షం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సాంగ్స్ తో పాటు కథ కూడా అద్భుతంగా ఉండటంతో ప్రభాస్ కు సార్ ఇమేజ్ ను తెచ్చిపెటింది సినిమా.  ఆ తరువాత ఈ యువహీరో చేసిన అడవిరాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ను మార్చేసింది. మాస్ హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సాధించింది. ఆ తరువాత పౌర్ణమి, యోగి, మున్నా ఈ మూడు ఫెయిల్ కాగా, పూరి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనంతరం వచ్చిన రెండు సినిమాలు భిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు ఫెయిల్ కాగా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు వరసగా హిట్ కొట్టాయి. దీనితర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సీరీస్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పక్కర్లేదు. బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు సాధించాయి.  ప్రపంచంలోని అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. ఇక 148 సంవత్సరాల చరిత్ర కలిగిన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి ది బిగినింగ్ ను ప్రదర్శించారు. ఇది ఇండియన్ సినిమాకు కలిగిన గొప్ప గౌరవంగా చెప్పొచ్చు. అలాగే  సుజిత్ దర్శకత్వంలో చేసిన సాహో సినిమా యావరేజ్ గా ఆడినా వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోవడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ పీరియాడికల్ స్టోరీతో రాధేశ్యామ్ , నాగ్ అశ్విన్ తో ఓ సినిమా , హిందీ దర్శకుడితో కలిసి ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు . ఇప్పటికే రాధేశ్యామ్ నుంచి డార్లింగ్ లుక్ రిలీజ్ అయింది. ఈ లుక్ ప్రేక్షకుల్లో విపరీతంగా దూసుకు పోతుంది.