హ్యాపీ బర్త్ డే తారక్... 

హ్యాపీ బర్త్ డే తారక్... 

ఎన్టీఆర్... ఈ పేరు వింటే అభిమానులకు ఒళ్ళు పులకరిస్తుంది.  ఆయన మాట అభిమానులకు వేదవాక్కు.  సినిమాల్లో చెప్పే డైలాగ్ మాత్రమే కాదు, బయట సభల్లో మాట్లాడే తీరు కూడా అద్భుతం.  అందుకే రంగం ఏదైనా సరే ఎన్టీఆర్ అడుగుపెడితే రికార్డులు మోత ఖాయమే.  నిన్ను చూడాలని అంటూ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన బాలరాముడు, స్టూడెంట్ నెంబర్ గా నిలిచాడు.  ఆదిగా అదరగొట్టిన ఎన్టీఆర్ సింహాద్రితో రెచ్చిపోయాడు.  యమదొంగ మనసులు దోచుకున్న యువహీరో ఎన్టీఆర్, టెంపర్ తో తనలోని నటనా వైదుష్యాన్ని అదుర్స్ అనేలా చేశాడు.  

వరసగా హిట్స్ తో దూసుకుపోతున్న తారక రాముడు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.  గిరిజన వీరుడు కొమరం భీం పాత్రలో మెప్పించేందుకు సిద్దమౌతున్న ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఎప్పుడు పుట్టినరోజు నాడు అభిమానులకు దగ్గరగా ఉండే ఎన్టీఆర్, లాక్ డౌన్ కారణంగా దూరంగా ఉండాల్సి వచ్చింది.  లాక్ డౌన్ లో దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉన్నాడు.  కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.